Select Your Gotra

Tuesday, September 6, 2011

bhupati raju soma raju garu

భూపతిరాజు సోమరాజు

భూపతిరాజు సోమరాజు ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణులు.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో సెప్టెంబరు 25, 1948 లో జన్మించారు. గ్రామంలోని ప్రాథమిక విద్యానంతరం, వీరు గుంటూరు వైద్య కళాశాల నుండి 1970లో వైద్య విద్యలో పట్టా పొందారు. వీరు చదువులోనే కాకుండా ఆటలలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. వీరు 1974 లో పి.జి.ఐ., చండీఘర్ నుండి ఎమ్.డి. తరువాత 1977లో డి.ఎమ్. (కార్డియాలజీ) సంపాదించారు.

వీరు ఆంధ్ర ప్రదేశ్ వైద్య సర్వీసులో కార్డియాలజీలో అసిస్టెంటు ప్రొఫెసర్ గా చేరారు. ఉస్మానియా వైద్య కళాశాల మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో 1983 వరకు పనిచేశారు. వీరికి వైద్య విద్యార్ధులకు బోధించడం చాలా ఇష్టమైన విషయం మరియు చాలా మంది విద్యార్ధులు వీరి నైపుణ్యానికి ముగ్ధులయ్యేవారు. తరువాత వీరు నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో చేరారు. నైపుణ్యత ఆధారంగా వీరు ఎన్.టి.రామారావు గారి కాలంలో కార్డియాలజీ ప్రొఫెసర్ గా 1987లో పదవోన్నతి పొందారు.

ప్రస్తుతం సోమరాజు గారు కేర్ హాస్పిటల్ హెడ్ మరియు చైర్మన్. వీరి ముఖ్యమైన ఉద్దేశం పేదవారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలకు అందజేయడం. ఈ సంస్థలో ఇంతవరకు ఇలాంటి సేవలు చాలా మందికి అందించి ఉన్నతమైన సేవలందిస్తున్నారు.

వీరి సేవలకు గాను భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.


Other Links

visitors count

By onlinedegreeadvantage.com degree portal.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Design Blog, Make Online Money